ట్రాఫిక్ హోంగార్డుపై దాడికి యత్నించిన యువకులు

ABN , First Publish Date - 2020-07-10T03:25:08+05:30 IST

హైదరాబాద్ : నగరంలోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ హోంగార్డు కిరణ్‌పై కొందరు యువకులు దాడికి యత్నించారు.

ట్రాఫిక్ హోంగార్డుపై దాడికి యత్నించిన యువకులు

హైదరాబాద్ : నగరంలోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ హోంగార్డు కిరణ్‌పై కొందరు యువకులు దాడికి యత్నించారు. ట్రాఫిక్ విధుల్లో భాగంగా రాంగ్ రూట్‌లో వచ్చిన యువకులను హోం గార్డ్ ఫోటో తీశారు. ఈ క్రమంలో తమనే ఫోటో తీస్తారా..? అని ఆగ్రహానికి లోనైన యువకులు హోంగార్డుపై దాడికి యత్నించారు. యువకులను ప్రశ్నించిన ట్రాఫిక్ ఎస్ఐ శేఖర్‌ను కూడా వారు అసభ్యకర పదజాలంతో దూషించారు. ఈ ఘటన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యం థియేటర్ వద్ద చోటు చేసుకుంది. విధులకు ఆటంకం కలిగించి దాడికి యత్నించిన ముగ్గురు యువకులపై ఫిర్యాదు చేయగా.. ట్రాఫిక్ ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-07-10T03:25:08+05:30 IST