Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 27 2021 @ 16:26PM

Viral Video: ఆదివారం ఖాళీ చేయించారు.. సోమవారం కూలిపోయింది!

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ పాత భవనం కూలిపోయింది. విల్సన్ గార్డెన్స్ ప్రాంతంలోని ఓ మూడంతస్తుల భవనం పగుళ్లొచ్చి పెచ్చులూడిపోయింది. ఆ భవనం కూలిపోయే ప్రమాదం ఉందని గమనించిన కార్పొరేషన్ అధికారులు అందులో నివాసం ఉంటున్న వారిని ఆదివారం ఖాళీ చేయించారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి ఆ భవనం సోమవారం కుప్పకూలిపోయింది. అందులో ఉంటున్న వారిని ముందే ఖాళీ చేయించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు నివారించగలిగారు. భవనం కూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Advertisement
Advertisement