Abn logo
Sep 24 2021 @ 00:43AM

మహమ్మద్ సిరాజ్‌తో థమ్స్అప్ ఒప్పందం

హైదరాబాద్: టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌తో కోకా-కోలా ఇండియా స్వదేశీ బ్రాండ్ థమ్స్ అప్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని కోకాకోలా ఇండియా, సౌత్-వెస్ట్ ఏషియా వైస్ ప్రెసిడెంట్, హెడ్-మార్కెటింగ్ అర్నబ్ రాయ్ ప్రత్యేకంగా వివరించారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌(ఐసీసీ)తో థమ్స్ అప్ ఇప్పటికే భాగస్వామ్యం కలిగి ఉందని, ఇప్పుడు దీనికి కొనసాగింపుగా టీమిండియా ఆటగాళ్లతో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ భాగస్వామ్యంపై మహమ్మద్ సిరాజ్, మాట్లాడుతూ.. "థమ్స్ అప్‌తో భాగస్వామ్యం చేసుకోవటం సంతోషంగా ఉంది. నా జీవిత ప్రయాణం, అనుభవాలను వివరించేందుకు ఈ వేదిక దొరికినందుకు గౌరవంగా భావిస్తున్నాన’ని అన్నారు.