Abn logo
May 4 2021 @ 16:50PM

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు పిడుగు హెచ్చరిక

అమరావతి: శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఏపీ విపత్తుల శాఖ పిడుగు హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లాలో మందస, పలాస, మేలియపుట్టి, రాజాంలో, విజయనగరం జిల్లాలో గుర్ల, గజపతినగరం మండలాల్లో పిడుగు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పిడుగులు ఉధృతంగా పడే అవకాశం ఉందని, పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని తెలిపింది. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించింది. ఈ మేరకు విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు ప్రకటన విడుదల చేశారు.   

Advertisement
Advertisement
Advertisement