Abn logo
Apr 19 2021 @ 20:24PM

ఏపీలోని ఈ మూడు జిల్లాలకు హెచ్చరిక

అమరావతి: వర్షాలు పడుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అప్రమత్తమైంది. పిడుగుల పడే ప్రదేశాలను అంచనా వేసింది. ప్రకాశం జిల్లాతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రకటించింది. ప్రకాశం జిల్లా పొదిలి, కొనకనమిట్ల, కనిగిరి, మర్రిపూడి, బేస్తవారిపేట, అర్ధవీడు, పెద్దరావీడు, తర్లుపాడు, హనుమంతునిపాడు మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. 


విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం, కొమరాడ,  పార్వతీపురం,కురుపాం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, సీతానగరం, మక్కువ, సాలూరు, పాచిపెంట, బలిజిపేట, బొబ్బిలితో పాటు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, కవిటి, పలాస, సీతంపేట, భామిని, వంగర, వీరఘట్టం మండలాల పరిసర ప్రాంతాల్లో ఉధృతంగా పిడుగులు పడే అవకాశం ఉందని కె.కన్నబాబు హెచ్చరించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని కె.కన్నబాబు పేర్కొన్నారు. 


Advertisement
Advertisement
Advertisement