ఉరుములు మెరుపులతో వడగళ్ల వాన

ABN , First Publish Date - 2021-04-14T05:25:17+05:30 IST

బాన్సువాడ డివిజన్‌ వ్యాప్తంగా మంగళ వారం ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసింది.

ఉరుములు మెరుపులతో వడగళ్ల వాన
నస్రుల్లాబాద్‌లో కురిసిన వడగళ్లు

  ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు 

  తడిసిన వరి ధాన్యం 

 ఆందోళనలో రైతులు

బాన్సువాడ, ఏప్రిల్‌ 13: బాన్సువాడ డివిజన్‌ వ్యాప్తంగా మంగళ వారం ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. దీంతో వరి ధాన్యం తడిసి పోవడంతో రైతన్నలు ఆందోళన చెందారు. నస్రుల్లాబాద్‌ మండలంలో వడగళ్ల వర్షం కురిసింది. బాన్సువాడ డి విజన్‌లో మద్నూర్‌, బిచ్కుంద, పెద్ద కొడప్‌గల్‌, నిజాంసాగర్‌, పిట్లం, జుక్కల్‌, నస్రుల్లాబాద్‌, బీర్కూర్‌, బాన్సువాడ మండలాల్లో ఓ మోస్తా రు వర్షం కురిసింది. జుక్కల్‌ ప్రాంతంలో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. నస్రుల్లాబాద్‌ మండలంలో, బీర్కూర్‌ మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.

బీర్కూర్‌: మండలంలో మంగళవారం ఈదురు గాలులతో వడగళ్ల వాన కురిసింది. దీంతో ప్రధాన రహదారులపై పంట పొలాల్లో రైతులు ఆరబెట్టుకున్న వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది.    భారీ వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది. అలాగే మామిడి కాయలు    రాలిపోయాయి. రైతులు ఆందోళన చెందుతున్నారు.

వరి ధాన్యం పరిశీలన

రామారెడ్డి: మండల కేంద్రంలో సోమవారం కురిసిన రాళ్ల వర్షాని కి వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులకు రైతు లు విన్నవించారు. దెబ్బతిన్న వరి పొలాలను, వరి ధాన్యంను   ఏఈ వో రాకేష్‌ పరిశీలించారు. ఎంతమేర నష్టం జరిగిందో అంఛనా వేశా రు. దాదాపు మూడు వందల ఎకరాల వరకు ఉంటుందని చె ప్పారు. తమని ఆదుకోవాలని రైతులను డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-04-14T05:25:17+05:30 IST