‘తూర్పార’ తంటాలు

ABN , First Publish Date - 2021-11-30T05:28:12+05:30 IST

కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీక్లీనర్ల కొరత నెలకొన్నది. దీంతో తూర్పార పట్టేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ఒక్కొక్కటి చొప్పున మాత్రమే ప్యాడీక్లీనర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో రైతులు ముందుగా తామంటే తామని తగాదా పెట్టుకుంటున్నారు. చేర్యాల, కొమురవెల్లి మండలాల్లోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఈ దృశ్యాలే కనిపించాయి.

‘తూర్పార’ తంటాలు
చేర్యాల మండలం దానంపల్లి గ్రామంలో ప్యాడీక్లీనర్‌ తీసుకెళ్లకుండా యంత్రంపై కూర్చున్న రైతు

కొనుగోలు కేంద్రాలలో ప్యాడీక్లీనర్ల కొరత 

తూర్పార పట్టుకునేందుకు రైతుల కుస్తీ


చేర్యాల, నవంబరు 29 : కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీక్లీనర్ల కొరత నెలకొన్నది. దీంతో తూర్పార పట్టేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ఒక్కొక్కటి చొప్పున మాత్రమే ప్యాడీక్లీనర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో రైతులు ముందుగా తామంటే తామని తగాదా పెట్టుకుంటున్నారు. చేర్యాల, కొమురవెల్లి మండలాల్లోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఈ దృశ్యాలే కనిపించాయి. 

ప్రభుత్వం నిర్ణయించిన మేర తేమశాతం కలిగి ఉండి తాలు ఉండకూడదన్న నిబంధన కారణంగా ధాన్యం తూర్పార పట్టేందుకు రైతులు ఎగబడుతున్నారు. ఓవైపు ఆకాశంలో మబ్బులు కమ్ముకుని చల్లగా ఉంటుండంతో ఇటు ఆరబెట్టుకోలేక, అటు అమ్ముకోలేక రోజుల తరబడిగా కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో కనీసం ధాన్యం తూర్పార పట్టుకునేందుకైనా ప్యాడీక్లీనర్లు అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆదివారం చేర్యాల మండలం దానంపల్లి గ్రామంలో రైతులు ప్యాడీక్లీనర్‌ కోసం తగాదా పడ్డారు. ఇక్కడి కొనుగోలు కేంద్రంలో ఒకే ప్యాడీక్లీనర్‌ ఉండటంతో తూర్పారా పట్టుకునే విషయమై ఆదివారం రైతులకు మధ్య మాటమాట పెరగింది. ఇది ఒకరిపై మరొకరు చేయిచేసుకునే వరకు వెళ్లింది. ఓ రైతు తన వడ్లు తూర్పార పట్టడం పూర్తయ్యేవరకు ప్యాడీక్లీనర్‌ తీసుకెళ్లకుండా ఏకంగా యంత్రంపై కూర్చున్నాడు. అధికారులు వెంటనే స్పందించి ప్యాడీక్లీనర్ల కొరత తీర్చాలని, త్వరితగతిన ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2021-11-30T05:28:12+05:30 IST