వైభవంగా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం

ABN , First Publish Date - 2022-01-24T05:25:08+05:30 IST

బుచ్చిరెడ్డిపాళెంలో నాయీ బ్రాహ్మణ సేవా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం మంగళ మేళాల నడుమ సద్గురు శ్రీ త్యాగరాజస్వామి ఆరాఽఽధనోత్సవం వైభవంగా జరిగింది.

వైభవంగా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం
బుచ్చిరెడ్డిపాళెంలో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం

బుచ్చిరెడ్డిపాళెం, జనవరి 23: బుచ్చిరెడ్డిపాళెంలో నాయీ బ్రాహ్మణ సేవా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం మంగళ మేళాల నడుమ సద్గురు శ్రీ త్యాగరాజస్వామి ఆరాఽఽధనోత్సవం వైభవంగా జరిగింది.  ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఓ ట్రాక్టర్‌పై త్యాగరాజస్వామి చిత్రపటానికి ప్రత్యేక పుష్పాలంకరణ చేసి ఊరేగించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ ఛైర్‌పర్సన్‌ మోర్ల సుప్రజా మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. అదే విధంగా పలువురు కౌన్సిలర్లు, పాల్గొన్నారు.


Updated Date - 2022-01-24T05:25:08+05:30 IST