సభకు హాజరైతేనే మళ్లీ టికెట్లు!

ABN , First Publish Date - 2021-12-08T07:20:36+05:30 IST

ర్లమెంటు సమావేశాలకు సొంత పార్టీ ఎంపీలు పెద్దసంఖ్యలో గైర్హాజరు అవుతుండడంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.....

సభకు హాజరైతేనే  మళ్లీ టికెట్లు!

బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ హెచ్చరిక 

పార్లమెంటుకు గైర్హాజరుపై అసంతృప్తి

మీరు మారకపోతే.. మార్పు తప్పదు: మోదీ


న్యూఢిల్లీ, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు సమావేశాలకు సొంత పార్టీ ఎంపీలు పెద్దసంఖ్యలో గైర్హాజరు అవుతుండడంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభకు సక్రమంగా హాజరయ్యే వారికే 2024 ఎన్నికల్లో మళ్లీ పార్టీ టికెట్లు వస్తాయని పరోక్షంగా హెచ్చరించారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ మాట్లాడారు. పార్లమెంటు సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరు కావాలని తాను తరచూ చెబుతున్నానని, అయినా ఎంపీల వైఖరిలో మార్పు రావడం లేదని అన్నారు. ‘‘చిన్నపిల్లలకు చెప్పినట్లు మీకు చెప్పడం బాగుండదు. మీలో మార్పు రాకపోతే భవిష్యత్తులో మార్పులు తప్పవు’’ అని మోదీ హెచ్చరించారు. దీంతో సిటింగ్‌ ఎంపీలకు వారి పనితీరు, పార్లమెంటులో హాజరు ఆధారంగానే తిరిగి టికెట్లు లభిస్తాయన్న విషయాన్ని ప్రధాని పరోక్షంగా చెప్పారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సమావేశంలో అంతకుముందు మాట్లాడిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి కూడా.. సభలో రెండుసార్లు కోరమ్‌ లేకపోవడంతో ఎంపీలను పిలిపించాల్సి వచ్చిందని చెప్పారు. ఇక ఎంపీలందరూ తమ నియోజకవర్గాల పరిధిలోని బీజేపీ జిల్లా, మండల అధ్యక్షులను తేనీటి విందుకు పిలవాలని జేపీ నడ్డా సూచించారు. ప్రధాని మోదీ తన నియోజకవర్గమైన వారాణసీ పరిధిలోని జిల్లా పార్టీ, మండల పార్టీ అధ్యక్షులతో ఈ నెల 14న సమావేశం కానున్నారని తెలిపారు. 


బీజేపీ ఎంపీలకు మోదీ హెచ్చరిక 

న్యూఢిల్లీ, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు సమావేశాలకు సొంత పార్టీ ఎంపీలు పెద్దసంఖ్యలో గైర్హాజరు అవుతుండడంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభకు సక్రమంగా హాజరయ్యే వారికే 2024 ఎన్నికల్లో మళ్లీ పార్టీ టికెట్లు వస్తాయని పరోక్షంగా హెచ్చరించారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ మాట్లాడారు. పార్లమెంటు సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరు కావాలని తాను తరచూ చెబుతున్నానని, అయినా ఎంపీల వైఖరిలో మార్పు రావడం లేదని అన్నారు. కాగా, సమావేశంలో అంతకుముందు మాట్లాడిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి కూడా.. సభలో రెండుసార్లు కోరమ్‌ లేకపోవడంతో ఎంపీలను పిలిపించాల్సి వచ్చిందని చెప్పారు. 


వారు యూపీకి ప్రమాదకరం: ప్రధాని

గోరఖ్‌పూర్‌/లఖ్‌నవూ, డిసెంబరు 7: ఎర్రటోపీ వారు (సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌) ఉత్తరప్రదేశ్‌కు ప్రమాదకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వారు ఉగ్రవాదుల సానుభూతిపరులని, జైల్లో ఉన్న ముష్కరులను విడుదల చేసేందుకే వారు అధికారం కోరుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో మంగళవారం ఫర్టిలైజర్‌ ప్లాంట్‌, ఎయిమ్స్‌, భారతీయ వైద్య పరిశోధన మండలికి (ఐసీఎంఆర్‌) చెందిన ప్రాంతీయ వైద్య పరిశోధన మండలిని మోదీ ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా వచ్చే ఏడాది జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎస్పీ, రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్డీ) పొత్తు కుదుర్చుకున్నాయి. మంగళవారం మీరట్‌లో జరిగిన ఓ ర్యాలీలో ఈ విషయాన్ని ఆ రెండు పార్టీలు అధికారికంగా ప్రకటించాయి. 

Updated Date - 2021-12-08T07:20:36+05:30 IST