Abn logo
Oct 24 2020 @ 04:56AM

గృహయోగం ఎప్పటికో...

టిడ్కో ఇళ్ల ఊసెత్తని ప్రభుత్వం

శిథిలావస్థలో గృహ సముదాయాలు

లబ్ధిదారుల నుంచి రూ.93.37 కోట్లు వసూలు

కిస్తీలు కట్టాలని బ్యాంకర్ల నుంచి ఒత్తిడి  

అటు అద్దెలు.. ఇటు అప్పులపై 

వడ్డీ భారంతో లబోదిబో

16 నెలలుగా మౌలిక వసతులు 

కల్పించడంలో ప్రభుత్వం విఫలం


(ఆంధ్రజ్యోతి - న్యూస్‌నెట్‌వర్క్‌): పేదలందరికీ ఇళ్లు అనే పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  జిల్లాలో 25,932 గృహాల నిర్మాణం చేపట్టాయి. వీటిలో 13,256ఇళ్ళనిర్మాణం పూర్తయి నెలలు గడుస్తు న్నాయి. ఫినిషింగ్‌ స్టేజిలో 8,890 గృహాలు ఉంటే వాటిని పూర్తి చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో పేదల సొంతింటి కల ఇప్పట్లో నెరవేరే పరిస్థితులు కనిపించడంలేదు. నిర్మాణం 80శాతం దాటిన ఇళ్ళను పూర్తిచేస్తామని ప్రభుత్యం ప్రకటించినా ఆ దిశగా పనులు జరగడంలేదు. పూర్తయిన ఇళ్లకు కల్పించాల్సిన మౌలిక వసతుల గురించి పట్టించు కోవడంలేదు. తాగునీరు, డ్రెయినేజి, అంతర్గత రహదారులు, విద్యుత్‌ సౌకర్యాలను కల్పించాల్సివుంది.


ఈ పనులకు రూ.224.39 కోట్టు వ్యయం అవుతుందని టిడ్కో అంచనా వేసింది. అయితే నిధులు విడుదల కాకపోవడంతో పనులు పూర్తిచేయడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. మౌలిక వసతులు కల్పించక పోవడంతో జిల్లా అంతటా వేలాది గృహాలు నిరుపయోగంగా మారాయి. వాటా ధనం చెల్లించినా గృహాలను అప్పగించక పోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఆం దోళన చెందుతున్నారు. ఇలానే ఇళ్లను వదిలేస్తే అవి శిథిలా వస్థకు చేరి పాడైపోతాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారుల నుంచి జిల్లాలో రూ.93.93 కోట్లు ప్ర భుత్వం వసూలు చేసింది. నె లలు గడుస్తున్నా పేదల ఇంటి ఊసే ఎత్తడంలేదు. సొంతింటి కోసం అప్పు చేసి మరీ వారి వాటా ధనాన్ని ప్రభుత్వానికి చెల్లించారు. ఈ పరిస్థితుల్లో తమకు ఇల్లు ఎప్పటికి దక్కు తుందో అనే ఆవేదనతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. 


  చిలకలూరిపేటలో  తాగునీటి చెరువు రహదారిలో 52 ఎకరాల విస్తీర్ణంలో మొదటి దశలో 4,512 ఇళ్లు, రెండోదశలో 2 వేల ఇళ్లను నిర్మించాలని గత ప్రభుత్వం సంకల్పించింది. మొదటి దశలో 4,512 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మౌలిక వసతుల కల్పన కూడా దాదాపు పూర్తి చేసి ఎన్నికలకు ముందు గృహప్రవేశాలు కూడా జరిగాయి. వైసీపీ ప్రభుత్వం అరకొర పనులను పూర్తి చేసి ఆ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించలేదు. ప్రస్తుతం వాటిలో కొన్ని బ్లాక్‌లను కొవిడ్‌ సెంటర్‌గా వినియోగిస్తున్నారు. రెండో దశలో మధ్యలో నిలిచిన 2వేల ఇళ్ల నిర్మాణాలు వైసీపీ ప్రభుత్వంలో  ప్రారంభించనే లేదు. 


  తెనాలి సమీపంలోని వైకుంఠపురం వద్ద పేదల కోసం 850 గృహాలు నిర్మించగా వాటిలో 800 గృహాలను రిజిస్ట్రేషన్‌ కూడా చేశారు. పట్టణంలోని పూలే కాలనీ వద్ద మరో 2200 గృహాల నిర్మాణం చేపట్టగా అక్కడ వెయ్యి గృహాలు పూర్తయ్యాయి. వీటిని పట్టించుకోకపోవడంతో  ఏడాదిన్నరగా అఽ ధ్వానంగా మారి అసాంఘిక శక్తులకు నిలయంగా మారా యి. ఈ గృహాలను కొవిడ్‌ కేంద్రాలుగా వినియోగిస్తున్నారు.  


  పొన్నూరులో 2,368 ఫ్లాట్లు మంజూరుకాగా వాటిలో 90 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి. లబ్ధిదారులు వాటా కింద రూ.8కోట్లు మున్సిపాలిటీకి చెల్లించారు. పూర్తి అయిన ఇళ్లకు తాగునీరు, విద్యుత్‌, డ్రెయినేజి సౌకర్యం కల్పించాల్సి ఉంది. గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో కొందరు అనర్హులని తొలగించారు.  


   పిడుగురాళ్ల మున్సిపాలిటీకి 3648 గృహాలు మంజూరు కాగా 2019 ఫిబ్రవరికి సుమారు 75 శాతంపైగా పనులు పూర్తయ్యాయి. మొదటి రెండు కేటగిరీల కింద 2414 మంది లబ్ధిదారులు  రూ.59.83 లక్షలను తమ వాటాగా చెల్లించారు.  

 

సత్తెనపల్లిలోని భీమవరం డొంకరోడ్డు పక్కన ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో జీ పస్ల్‌ త్రీ పద్ధతిలో 160 గృహ నిర్మా ణాలు చేపట్టారు.  నిర్మాణ పనులు 60శాతం దాకా పూర్తి చేశారు.  డీడీలు కట్టిన వారు ఇళ్లను పూర్తిచేసి  ఎప్పుడు ఇస్తారా అని ఎదురుచూస్తున్నారు. డీడీలు కట్టిన లబ్ధిదా రులు మరో 280 మందికి నగదు వెనక్కి ఇచ్చారు.  


   వినుకొండలో ప్రభుత్వం 4,096 నివాస గృహాలను మంజూరు చేసి 2018లో పనులు చేపట్టింది. వైసీపీ ప్రభు త్వం రీటెండరింగ్‌ పేరుతో ఇటీవల ఇంద్రజిత్‌ మెహత అనే కంపెనీకి మిగిలిన 20 శాతం పనులు అప్పగించింది. అయి తే ఈ ఇళ్లను ఎప్పటికి పూర్తి చేస్తారో అర్థం కాక నగదు చెల్లించిన 1440మంది లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. కేటగిరి -2లో మరో 2,656 మంది దరఖాస్తులు చేసుకోగా అవి ఇంకా ప్రణాళికా దశలోనే ఉన్నాయి.  


కిస్తీలు.. కష్టాలు

కేంద్రం, రాష్ట్రం సబ్సిడీ, లబ్ధిదారుడి వాటా పో ను మిగిలిన మొత్తానికి ప్రభుత్వమే గ్యారెంటీ ఉండి లబ్ధిదారుడి పేరిట బ్యాంకుల నుంచి రుణం ఇప్పించింది. ఇప్పటికే లబ్ధిదారులు కిస్తీలు కూడా జమచేశారు. మరి కొన్ని బ్యాంకులు కిస్తీల కోసం ఒత్తిడి చేస్తున్నాయి. లబ్ధి దారులు కొంతమంది తమ వాటా మొత్తం కోసం అప్పులు చేశారు. ఆ అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నారు. ఇళ్లు రాక పోగా చేసిన అప్పుకు వడ్డీ మోయలేని భారంగా మా రింది. మరోవైపు అద్దెల భారంతో అల్లాడుతున్నా రు. ఇలా రెండువైపులా ఆర్థికభారం పడు తుండటంతో లబ్ధిదారులు లబోది బోమంటున్నారు.  


పాడు పెట్టేశారు

పేదల కోసం రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన గృహాలను పాడు పెట్టేశారు. గత ఎన్నికల ప్రచా రంలో తనను గెలిపిస్తే ఇంటి రుణం చెల్లించి ఉచి తంగా ఇళ్లు అందిస్తామని చెప్పిన జగన్‌.. ప్రస్తుతం పూర్తయిన ఇళ్ల ఊసే ఎత్తడంలేదు. ఆధునిక టె క్నాలజీతో నిర్మించిన  ఇళ్లను పాడు పెట్టేశారని లబ్ధిదారులు వాపోతున్నారు. గృహాల మధ్య పిచ్చిమొ క్కలు పెరుగుతున్నాయి. ఇళ్ల తలుపులు, గడులు పాడైపోతున్నాయి. మెట్లకు ఏర్పాటు చేసిన రెయిలింగ్‌ తప్పు పడుతోంది.


రెండున్నరేళ్ల క్రితం నగదు కట్టాం - తిరుమలశెట్టి కోటేశ్వరరావు, కారు డ్రైవరు, వినుకొండ  

2018లో సొంతింటి కోసం అప్పటి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం నాలుగు విడతల్లో సుమారు రూ.లక్ష చెల్లిస్తే డబల్‌ బెడ్‌రూమ్‌ ఇస్తామని అధికారులు తెలిపారు. మొదటి విడత రూ.25 వేలు చెల్లించాను. నగదు చెల్లించి రెండున్నరేళ్లు అవుతున్నా నేటికీ ఆ ఇళ్ల గురించి ప్రభుత్వం పట్టించుకో వడం లేదు. ఇటు అప్పు చేసిన నగదుకు వడ్డీ, ఉన్న ఇంటికి అద్దె చెల్లిస్తూ రెండు రకాలుగా ఆర్థిక  భారం పడుతోంది.  

Advertisement
Advertisement
Advertisement