రుణాలు ఇస్తేనే..అర్బన్‌ ఇళ్లు

ABN , First Publish Date - 2021-11-29T06:04:32+05:30 IST

అర్బన్‌ హౌసింగ్‌ ఇళ్లను డిసెంబరులోగా లబ్ధిదారులకు అందజేస్తా మంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

రుణాలు ఇస్తేనే..అర్బన్‌ ఇళ్లు
అర్బన్‌ హౌసింగ్‌ ఇళ్లు

డిసెంబరులోగా అప్పగింత కష్టతరమే 

రుణ పరిమితి రూ.205 కోట్లు.. ఇచ్చింది 36 కోట్లు


(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి):


అర్బన్‌ హౌసింగ్‌ ఇళ్లను డిసెంబరులోగా లబ్ధిదారులకు అందజేస్తా మంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, బ్యాంకుల నుంచి రుణా లు పొందిన లబ్ధిదారులకు మాత్రమే ఇళ్లు అప్పగిస్తామని ఏపీ టిడ్కో స్పష్టం చేస్తోంది. ప్రభుత్వం విధించిన గడువులోగా ఇళ్లు అందజేసేం దుకు ఇదే ప్రధాన అవరోధంగా మారుతోంది. లబ్ధిదారులకు రుణాలు ఇచ్చేందుకు జాతీయ బ్యాంకులు సానుకూలంగా స్పందిస్తున్నా ప్రైవేటు బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయి. జిల్లాలో తొలి, మలి విడత ఇళ్లకు సంబంధించి 16,672 మంది లబ్ధిదారులకు రూ.560 కోట్ల వరకు రుణా లు అందించాలి. ఆ మొత్తం ఏపీ టిడ్కో ఖాతాలో జమవుతుంది. అదే సొమ్మును నిర్మాణ ఏజెన్సీలకు ఇచ్చి.. తద్వారా ఈ ఇళ్లు పూర్తి చేయాలని ప్రభుత్వ భావన. కానీ ప్రైవేటు బ్యాంకుల వెనకడుగుతో జిల్లా కలెక్టర్‌ స్పందించారు.  జాతీయ, ప్రైవేటు బ్యాంకులన్నీ రుణాలు ఇవ్వాల్సిందేనని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటి వరకు రూ.36 కోట్లు మాత్రమే మంజూరు చేయగా ఇంకా రూ.524 కోట్లు ఇవ్వాలి. రుణం పొందిన తర్వాతే లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించాలని టిడ్కో నిర్ణయించిం ది. తొలివిడత నిర్మాణం చేపట్టిన ఇళ్లలో భీమవరంలో 1,920, తాడేపల్లి గూడెంలో 2,272,  పాలకొల్లులో 1,856 ఇచ్చేలా ప్రణాళిక చేశారు. టిడ్కో ప్రణాళిక ప్రకారం లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వాలంటే బ్యాంకులు దాదాపు రూ.205 కోట్ల రుణాలను మంజూరుచేయాలి. అధికారులు తొలి విడత లబ్ధిదారులపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. అయినా రుణ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. అదను చూసి ఏపీ టిడ్కో మెలిక పెట్టింది. నిర్మాణాలు పూర్తి కావాలంటే ఏజన్సీలకు సొమ్ములు చెల్లించాలి. రెండు న్నరేళ్లుగా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. బిల్లులు మం జూరు చేయకపోవడంతో మొదటి విడత ఇళ్లు నత్తనకడన సాగుతు న్నాయి. ఏలూరు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, నిడదవోలు, తణుకు పట్ట ణాల్లో నిర్మిస్తున్న రెండో విడత ఇళ్ల నిర్మాణం పూర్తిగా స్తంభించింది. నిర్మాణ ఏజెన్సీ చేతులెత్తేసింది. బకాయిలు చెల్లిస్తేనే పనులు పునః ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. 


Updated Date - 2021-11-29T06:04:32+05:30 IST