Advertisement
Advertisement
Abn logo
Advertisement

టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించాలి: రామకృష్ణ

అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు హయాంలో కట్టించిన టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించాలని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఏలూరులో టిడ్కో గృహాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల వద్ద ఇప్పటివరకూ మౌలిక సదుపాయాలు కల్పించలేదని విమర్శించారు. టిడ్కో ఇళ్లు చంద్రబాబు స్వంత నిధులతో నిర్మించలేదని, ప్రజా ధనంతో నిర్మించారని రామకృష్ణ తెలిపారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దాసోహం అయిందని దుయ్యబట్టారు. కేంద్రం రైతు అనుకూల చట్టాల పేరుతో మూడు నల్లచట్టాలు తీసుకువచ్చి కార్పొరేట్ సంస్థలకు లబ్ది చేకూర్చిందని విమర్శించారు. జగన్ సర్కార్ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులమయం చేసిందని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి జరుగుతోందా? అని రామకృష్ణ ప్రశ్నించారు. 

Advertisement
Advertisement