Abn logo
Oct 25 2021 @ 21:58PM

పశువుల మందపై పులి దాడి

మృతిచెందిన ఆవుదూడ

దహెగాం, అక్టోబరు 25: మండలంలోని ఖర్జి అటవీ ప్రాంతంలో సోమ వారం పశువుల మందపై పులిదాడి చేయడంతో ఆవుదూడ మృతిచెందింది. ఎఫ్‌బీవో, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పశువుల కాపరి ఎల్లయ్య పశువులను మేపడానికి అడవికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో పశువుల మందపై పులిదాడి చేసి ఆవుదూడను చంపింది. దీంతో భయాందోళకు గురైన ఎల్లయ్య చెట్టుపైకి ఎక్కి గ్రామస్థులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించాడు. ఎఫ్‌బీ వోలు రమేష్‌, రాకేష్‌లతోపాటు గ్రామస్థులు సంఘటన స్థలానికి చేరుకుని ఆవుదూడ వద్దకు వెళ్లి పరిశీలించగా మృతిచెంది ఉన్నట్లు తెలిపారు.