ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత

ABN , First Publish Date - 2022-01-23T15:33:35+05:30 IST

కోయంబత్తూరు జిల్లా కునియముత్తూరు సుగుణాపురం, కోలమావు మలై తదితర ప్రాంతాల వాసులను కొన్ని రోజులుగా భయపెడుతూ వచ్చిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. ఈ చిరుత ఈ నెల 17వ

ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత

అడయార్‌(చెన్నై): కోయంబత్తూరు జిల్లా కునియముత్తూరు సుగుణాపురం, కోలమావు మలై తదితర ప్రాంతాల వాసులను కొన్ని రోజులుగా భయపెడుతూ వచ్చిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. ఈ చిరుత ఈ నెల 17వ తేదీన కునియముత్తూరు సమీపంలోని పీకేపుదూరులో ఉన్న ఒక గిడ్డంగి భవనంలోకి వెళ్ళింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు.. అటవీశాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. ఆ వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు, పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది, గ్రామస్తుల సహకారంలో గోదాములో బోనును ఏర్పాటు చేశారు. అయితే, చిరుత బోనులోకి వెళ్ళకుండా ముప్పతిప్పలు పెట్టింది. దీంతో అటవీశాఖ అధికారులు పలు విధాలుగా ప్రయత్నించి, చివరకు శుక్రవారం అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో ఈ చిరుతను చాకచక్యంగా బోనులో బంధించారు. కొన్ని రోజులుగా ఆహారం, నీరు లేకపోవడంతో చిరుత బాగా నీరసించిపోయింది. దీంతో బోనుకలో చిక్కిన చిరుతకు నీరు, ఆహారాన్ని సిబ్బంది అందజేశారు. ఆ తర్వాత పొల్లాచ్చి టాప్‌సిలిప్‌ ప్రాంతానికి తరలించారు. ఈ చిరుత సంచారం కారణంగా రెండు నెలలుగా భయం భయంగా జీవిస్తూ వచ్చిన స్థానికులు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. 



Updated Date - 2022-01-23T15:33:35+05:30 IST