పులుల సంరక్షణే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలి

ABN , First Publish Date - 2021-12-03T04:08:25+05:30 IST

పులుల సంరక్షణే ప్రధాన లక్ష్యంగా ప్రతీ అటవీ అధికారి పని చేయాలని జాతీ య పులుల సంరక్షణ కమిటీ అడిషనల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ హరిణివేణుగోపాల్‌, సీసీఎఫ్‌ రామలింగంలు అన్నారు. మూడు రోజులుగా కవ్వాల్‌ టైగర్‌ జోన్‌లు జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవలంభించాల్సిన చర్యల ను అడిగి తెలుసుకున్నారు.

పులుల సంరక్షణే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలి
వివరాలు చెబుతున్న ఎఫ్‌డీవో మాధవరావు

జన్నారం, డిసెంబరు 2: పులుల సంరక్షణే ప్రధాన లక్ష్యంగా ప్రతీ అటవీ అధికారి పని చేయాలని జాతీ య పులుల సంరక్షణ కమిటీ అడిషనల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ హరిణివేణుగోపాల్‌, సీసీఎఫ్‌ రామలింగంలు అన్నారు. మూడు రోజులుగా కవ్వాల్‌ టైగర్‌ జోన్‌లు జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవలంభించాల్సిన చర్యల ను అడిగి తెలుసుకున్నారు. కవ్వాల్‌ టైగర్‌జోన్‌లోని అలీనగర్‌, దొంగపెల్లి, మల్యాలతోపాటు పలు ప్రాంతా ల్లో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులను పరిశీ లించారు. అడవిని కాపాడుకునేందుకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. గురువారం అటవీ శాఖ టీడీసీ కేంద్రంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశువులు అడవిలోకి రావడం వల్ల కలిగే నష్టాలు, వాటిని నిరోధించడంపై పలు సూచనలు చేశారు. అడవి గుండా వెళ్లే వాహనాల వేగాన్ని నియంత్రించ డంతోపాటు రాత్రి సమయాల్లో వాహనాలను నిలిపి వేయడంపై సూచనలు చేశారు. ఫీల్డ్‌ డైరెక్టర్‌ వినోద్‌కు మార్‌, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా డీఎఫ్‌వోలు రాజశేఖ ర్‌, శాంతారాం, వికాస్‌మీన, శివానీడోంగ్రె, ఎఫ్‌డీవో మాధవరావు, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-03T04:08:25+05:30 IST