అదిగో పులి..!

ABN , First Publish Date - 2022-01-29T06:14:41+05:30 IST

పులి సంచరిస్తోందని ఆ గ్రామస్థులు భీతిల్లుతుంటే.. అది పులి కాదు హైనా.. అంటు న్నారు అటవీ అధికారులు.

అదిగో పులి..!
గుర్తుతెలియని జంతువు పాదముద్రలు

ద్వారకాతిరుమల , జనవరి 28 : పులి సంచరిస్తోందని ఆ గ్రామస్థులు భీతిల్లుతుంటే.. అది పులి కాదు హైనా.. అంటు న్నారు అటవీ అధికారులు. ద్వారకా తిరుమల మండలం గుణ్ణంపల్లి పరిసర ప్రాంతాల్లో ఇటీవల మూడు దూడలు మృత్యువాత పడ్డాయి. రైతులు పులి పాదముద్రలను పోలిన జాడలను తమ భూముల్లో గుర్తించి హడలిపోతున్నారు. తమ పశువులపై కచ్చితంగా పులే దాడి చేసి చంపుతోందని భయాం దోళనలకు గురవుతున్నారు. దీనిపై ఫారెస్ట్‌ బీట్‌ కానిస్టేబుల్‌ మెహబూబ్‌ మాట్లాడుతూ దూడలపై దాడి చేసిన విధానాన్ని, అడుగు జాడలను పరిశీలిస్తే అది పులి కాదని హైనానే అని స్పష్టం చేశారు.  


Updated Date - 2022-01-29T06:14:41+05:30 IST