Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొయ్యూరు అటవీ ప్రాంతంలో పులి సంచారం

పెద్దపల్లి: జిల్లాలోని పెద్ద పులి సంచారంపై మంథని మండలంలోని అటవీ గ్రామాల ప్రజలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కొయ్యూరు అటవీ ప్రాంతం నుంచి సోమన్‌పల్లి అటవీ ప్రాంతానికి పులి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. సోమనపల్లి, వెంకటపూర్, అరేంద, ఖానాపూర్, కాన్సాయిపేట గ్రామస్తులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో..

భూపాలపల్లి: మల్హర్ మండలంలోని పీవీ నగర్ వద్ద పులిని చూసి అటవీశాఖ అధికారులకు ఓ ప్రయాణికుడు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకొని పాదముద్రలను అటవీ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.  


Advertisement
Advertisement