ఇప్పటికీ ‘టిక్‌ టాక్‌’ టాప్‌

ABN , First Publish Date - 2020-11-07T05:30:00+05:30 IST

అంతర్గత భద్రతకు ప్రమాదకరంగా మారాయని చాలా దేశాలు ‘టిక్‌ టాక్‌’ను నిషేధించినప్పటికీ దాని ఆదాయం గణనీయంగా పెరిగిందని ‘సెన్సర్‌ టవర్‌’ నివేదిక వెల్లడించింది...

ఇప్పటికీ ‘టిక్‌ టాక్‌’ టాప్‌

అంతర్గత భద్రతకు ప్రమాదకరంగా మారాయని చాలా దేశాలు ‘టిక్‌ టాక్‌’ను నిషేధించినప్పటికీ దాని ఆదాయం గణనీయంగా పెరిగిందని ‘సెన్సర్‌ టవర్‌’ నివేదిక వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్‌తో పోల్చుకున్నప్పుడు ఇది 6.2 రెట్లకు మించి ఉందని తేల్చింది. లేటెస్ట్‌ డేటా ప్రకారం ప్రపంచంలోనే  అత్యధిక ఆదాయం పొందిన యాప్‌ ‘టిక్‌టాక్‌’ అని పేర్కొంది. ఈ అక్టోబర్‌లో ఈ వీడియో యాప్‌ 115 మిలియన్‌ డాలర్ల మేర ఆదాయాన్ని సాధించి పెట్టింది. చైనాలో ‘డోయిన్‌’గా పేరొందిన టిక్‌టాక్‌ స్వదేశంలోనే ఆదాయ సముపార్జనలో అగ్రస్థానంలో ఉంది. టిక్‌టాక్‌ ఆదాయంలో 86 శాతం స్వదేశం చైనా నుంచే అందుతోంది. ఎనిమిది శాతంతో అమెరికా, రెండు శాతంతో టర్కీ తరవాతి స్థానాల్లో ఉన్నాయి. ఆపిల్‌ యాప్‌ స్టోర్‌లో టాప్‌టెన్‌లోనూ ‘టిక్‌ టాక్‌’ ఒకటి. ఆదాయపరంగా ‘యూట్యూబ్‌’ 94 మిలియన్‌ డాలర్ల రెవెన్యూతో గత నెలలో రెండో స్థానంలో ఉంది. ‘యూట్యూబ్‌’ మొత్తం ఆదాయంలో అమెరికా నుంచి 56 శాతం, జపాన్‌ నుంచి 11 శాతం లభిస్తోంది. ‘టిండర్‌’ మూడో ప్లేస్‌లో ఉంది.


Updated Date - 2020-11-07T05:30:00+05:30 IST