దూసుకుపోతున్న టిక్‌టాక్ రైవల్ మిత్రోన్ యాప్.. 1.7 కోట్ల డౌన్‌లోడ్లు

ABN , First Publish Date - 2020-07-03T00:31:57+05:30 IST

టిక్‌టాక్ యాప్‌ను భారత ప్రభుత్వం నిషేధించిన చేసిన తర్వాత స్వదేశీ యాప్ మిత్రోన్‌ దూసుకుపోతోంది.

దూసుకుపోతున్న టిక్‌టాక్ రైవల్ మిత్రోన్ యాప్.. 1.7 కోట్ల డౌన్‌లోడ్లు

న్యూఢిల్లీ: టిక్‌టాక్ యాప్‌ను భారత ప్రభుత్వం నిషేధించిన చేసిన తర్వాత స్వదేశీ యాప్ మిత్రోన్‌ దూసుకుపోతోంది. గూగుల్ ప్లే స్టోర్‌లో రెండు నెలల్లోనే కోటి డౌన్‌లోడ్ల మైలురాయిని అందుకున్న మిత్రోన్ యాప్.. ఆ తర్వాత వారంలోనే 1.7 కోట్ల డౌన్‌లోడ్లకు చేరుకోవడం విశేషం. యాప్‌కు పాప్యులారిటీ పెరుగుతున్న నేపథ్యంలో రెండు వెంచర్ క్యాపిటలిస్ట్ సంస్థలు ‘3 వన్ 4’, ‘లెట్స్ వెంచర్’ల నుంచి నుంచి రెండు కోట్ల రూపాయలను సమకూర్చుకుంది. ఈ నిధులతో ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌ను మరింత వేగవంతం చేయనుంది. అంటే నైపుణ్యం ఉన్న కొత్త వారిని తీసుకోవడం, మౌలిక సదుపాయాల కల్పన, ఇండియన్ కంటెంట్ క్రియేటర్లతో ఎంగేజ్ కావడం వంటివి చేయనుంది. కంటెంట్ నిర్మాణంతోపాటు దేశీయ కంటెంట్ క్రియేటర్లపై దృష్టి సారిస్తామని ‘మిత్రోన్’ వ్యవస్థాపకుడు శివాంక్ అగర్వాల్ తెలిపారు.   

Updated Date - 2020-07-03T00:31:57+05:30 IST