డేట్‌కు వెళ్లిన అమెరికన్ టిక్‌టాక్ స్టార్ మృతి

ABN , First Publish Date - 2021-08-02T00:16:14+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ సంస్కృతి వల్ల మరో వ్యక్తి ప్రాణం కోల్పోయాడు. అమెరికాలో టిక్‌టాక్ స్టార్ అయిన ఆంథనీ బరాజాస్ అనే

డేట్‌కు వెళ్లిన అమెరికన్ టిక్‌టాక్ స్టార్ మృతి

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ సంస్కృతి వల్ల మరో వ్యక్తి ప్రాణం కోల్పోయాడు. అమెరికాలో టిక్‌టాక్ స్టార్ అయిన ఆంథనీ బరాజాస్ అనే యువకుడు ప్రేయసితో కలిసి డేట్‌కు వెళ్లాడు. అతని వయసు 19 ఏళ్లుకాగా, ఆ అమ్మాయి వయసు 18. కాలేజిలో చదువుకుంటోంది. వీళ్లిద్దరూ డేట్‌కు వెళ్లిన సమయంలో వీరిపై ఒక వ్యక్తి ఊహించని విధంగా తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. కాలిఫోర్నియాలో జరిగిన ఈ ఘటనలో ఆంథనీ ప్రేయసి అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన ఆంథనీని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఉన్న ఆంథనీ తాజాగా మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ కాల్పుల వెనుక ఎటువంటి పగలూ, కారణాలూ కనిపించడం లేదని చెప్పిన పోలీసులు.. ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

Updated Date - 2021-08-02T00:16:14+05:30 IST