నిషేధంతో భారత్‌లో కార్యకలాపాలు నిలిపివేసిన టిక్‌టాక్

ABN , First Publish Date - 2020-07-01T00:23:49+05:30 IST

చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన తర్వాత దేశంలో తమ కార్యకలాపాలను ‘టిక్‌టాక్’ నిలిపివేసింది. ఇప్పటికే

నిషేధంతో భారత్‌లో కార్యకలాపాలు నిలిపివేసిన టిక్‌టాక్

న్యూఢిల్లీ: చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన తర్వాత దేశంలో తమ కార్యకలాపాలను ‘టిక్‌టాక్’ నిలిపివేసింది. ఇప్పటికే ఈ యాప్‌ను భారత్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న వారు మరికొంత కాలం మాత్రమే ఈ యాప్‌ను ఉపయోగించగలుగుతారు. భారత ప్రభుత్వ నిర్ణయంతో గూగుల్ తమ ప్లే స్టోర్ నుంచి టిక్‌టాక్‌ను తొలగించింది. యాపిల్ కూడా తమ యాప్ స్టోర్ నుంచి దీనిని తొలగించింది. అయితే, ఇప్పటికే ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న వారు మాత్రం మరికొంత కాలం పాటు ఉపయోగించుకునే వీలుంది. అయితే, ఆ సమయం దాటితే మాత్రం యాప్ సేవలు పూర్తిగా నిలిచిపోతాయి.  


ఎయిర్‌టెల్ నెట్‌వర్క్, స్పెక్ట్రా, ఎగ్జిటెల్ వంటి బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులపై మాత్రం టిక్‌టాక్ పనిచేయదు. దేశంలో టిక్‌టాక్ వెబ్‌సైట్‌ను కూడా తొలగించారు. దాని యూఆర్ఎల్‌పై క్లిక్ చేస్తే ‘నాట్ ఫౌండ్’ అని మెసేజ్ చూపిస్తోంది.   

Updated Date - 2020-07-01T00:23:49+05:30 IST