కుక్కలకు కుందేలును అందిస్తూ టిక్‌ టాక్‌ వీడియో..చివరికిలా..!

ABN , First Publish Date - 2020-06-01T14:49:59+05:30 IST

పెంపుడు కుక్కలకు కుందేలును ఆహారంగా అందిస్తూ టిక్‌ టాక్‌ వీడియోను..

కుక్కలకు కుందేలును అందిస్తూ టిక్‌ టాక్‌ వీడియో..చివరికిలా..!

  • ముగ్గురు యువకులకు రూ.21 వేల జరిమానా

చెన్నై : పెంపుడు కుక్కలకు కుందేలును ఆహారంగా అందిస్తూ టిక్‌ టాక్‌ వీడియోను అప్‌లోడ్‌ చేసిన ముగ్గురు యువకులకు రూ.21 వేల జరిమానా విధించారు. ‘కరోనా’ లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటున్న యువతీ యువకులు టిక్‌టాక్‌లో తమ వీడియోలను అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి కుందేలును తన పెంపుడు కుక్కలకు ఆహారంగా అందిస్తూ చిత్రీకరించిన వీడియో రెండ్రోజులుగా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది.. దీనిపై కేసు నమోదుచేసి విచారణ చేపట్టిన అటవీ శాఖ అధికారులు కోయంబత్తూర్‌ జిల్లా కినత్తుకడవు సమీపం మేట్టువావికి చెందిన కార్తీని అదుపులోకి తీసుకున్నారు.


రోడ్డు ప్రమాదంలో చిక్కుకొని మృతిచెందిన కుందేలును తీసుకొచ్చి తన పెంపుడు శునకాలకు ఆహారంగా అందించినట్టు, ఆ దృశ్యాలను తన స్నేహితులు కుమార్‌, తమిళ్‌వానన్‌లు టిక్‌ టాక్‌ వీడియోగా చిత్రీకరించారని తెలిపాడు. దీంతో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు, వారికి తలా రూ.7 వేల వంతున రూ.21 వేలు జరిమానా విధించి హెచ్చరించి పంపించారు.

Updated Date - 2020-06-01T14:49:59+05:30 IST