Abn logo
Jul 8 2020 @ 15:00PM

నేను వర్జిన్‌ను, వెజిటేరియన్‌ని..: హీరోయిన్‌కు వింత ప్రపోజల్

బాలీవుడ్ హీరోయిన్ తిలోత్తమ షోమ్‌కు వచ్చిన పెళ్లి ప్రపోజల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. `మాన్‌సూన్‌ వెడ్డింగ్`‌తో బాలీవుడ్‌‌కు పరిచయమైన తిలోత్తమ మంచి గుర్తింపు సంపాదించుకుంది. తిలోత్తమను అభిమానిస్తున్న ఓ వ్యక్తి  సోషల్ మీడియా ద్వారా పెళ్లి ప్రపోజల్ చేశాడు. 


`మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నా. మీరు నన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉంటారా? నేను వర్జిన్‌. అలాగే వెజిటేరియన్‌‌ను. లై డిటెక్టర్‌ టెస్టు, నార్కో టెస్టు, వర్జినిటీ టెస్టు, బ్రెయిన్‌ మ్యాపింగ్‌ టెస్టు చేయించుకోడానికి సిద్ధంగా ఉన్నాన`ని మెసేజ్ చేశాడు. ఈ మెసేజ్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన తిలోత్తమ.. `బ్రదర్ జోక్‌ చేస్తున్నావా? అవసరం లేదు. బై బై` అంటూ రిప్లై ఇచ్చింది. Advertisement
Advertisement
Advertisement