అలా జరిగి ఉంటే భారత జట్టు ఫిర్యాదు చేసి ఉండేది కదా: ఆసీస్ కెప్టెన్

ABN , First Publish Date - 2021-01-12T22:40:40+05:30 IST

మూడో టెస్టులో రిషభ్ పంత్ గార్డ్‌ మార్క్‌ను చెరిపేస్తూ కెమెరాకు చిక్కిన ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌ను ఆ

అలా జరిగి ఉంటే భారత జట్టు ఫిర్యాదు చేసి ఉండేది కదా: ఆసీస్ కెప్టెన్

సిడ్నీ: మూడో టెస్టులో రిషభ్ పంత్ గార్డ్‌ మార్క్‌ను చెరిపేస్తూ కెమెరాకు చిక్కిన ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌ను ఆ జట్టు కెప్టెన్ టిమ్ పైన్ వెనకేసుకొచ్చాడు. పంత్‌పై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, నిజంగా అతడు తప్పే చేసి ఉంటే భారత జట్టు ఎప్పుడో ఈ విషయంపై ఫిర్యాదు చేసి ఉండేదని పేర్కొన్నాడు. మూడో టెస్టులో పంత్ అద్వితీయ ఆటతీరుతో భారత జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు. అయితే, సెంచరీకి మూడు పరుగుల ముందు ఔటయ్యాడు. ఆ తర్వాత మ్యాచ్ ఆ తర్వాత డ్రాగా ముగిసింది.

 

తాను స్మిత్‌తో మాట్లాడానని, తనపై వస్తున్న వార్తలతో అతడు తీవ్రంగా కలత చెందాడని వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పైన్ పేర్కొన్నాడు. స్మిత్ తప్పకుండా ఆ పని చేసి ఉండడని, నిజంగానే అతడు గార్డ్ మార్కులను మార్చి ఉంటే భారత జట్టు తప్పకుండా ఈ విషయంపై ఫిర్యాదు చేసి ఉండేదని అన్నాడు. స్మిత్‌ను తాను చాలా ఏళ్లుగా చూస్తున్నానని, అతడితో కలిసి ఎన్నో మ్యాచ్‌లు ఆడానని పైన్ గుర్తు చేసుకున్నాడు. 

Updated Date - 2021-01-12T22:40:40+05:30 IST