బీరకుప్పం తాగునీటి పథకం పూర్తికి గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2021-06-20T05:41:02+05:30 IST

సత్యవేడు నియోజకవర్గంలోని బీరకుప్పం గ్రామానికి మంజూరైన కేంద్ర రక్షిత నీటి సరఫరా (సీపీడబ్ల్యుఎస్‌) పథకం పూర్తి చేయడానికి గడువు పొడిగిస్తూ పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది శనివారం ఆదేశాలు జారీ చేశారు.

బీరకుప్పం తాగునీటి పథకం పూర్తికి గడువు పొడిగింపు

కలికిరి, జూన్‌ 19: సత్యవేడు నియోజకవర్గంలోని బీరకుప్పం గ్రామానికి మంజూరైన కేంద్ర రక్షిత నీటి సరఫరా (సీపీడబ్ల్యుఎస్‌) పథకం పూర్తి చేయడానికి గడువు పొడిగిస్తూ పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది శనివారం ఆదేశాలు జారీ చేశారు. రూ. 3 కోట్ల అంచనాతో ఈ రక్షిత నీటి సరఫరాను బీరకుప్పంతోపాటు మరో 9 కుగ్రామాలకు నీటి సరఫరా చేసే పనులు చేయ డానికి 2018 సెప్టెంబరులో కాంట్రాక్టరుకు అప్పగించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 7వ తేదీ నాటికి తాగునీటి సరఫరా జరగాల్సి ఉంది. అయితే గడువులోగా పనులు పూర్తి కాకపోవడంతో ఆగస్టు 31వ తేదీ వరకూ గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 

Updated Date - 2021-06-20T05:41:02+05:30 IST