టైమ్‌ ఆసుపత్రిలో అఽధునాతన చికిత్స

ABN , First Publish Date - 2022-01-23T06:26:16+05:30 IST

టైమ్‌ ఆసుపత్రిలో అఽధునాతన చికిత్స

టైమ్‌ ఆసుపత్రిలో అఽధునాతన చికిత్స
సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ యశ్వంత్‌

పెనమలూరు, జనవరి 22 : ఖ్యినా లేజర్‌ ట్రీట్‌మెంట్‌తో అధునాతన చికిత్స చేసినట్లు టైమ్‌ హాస్పిటల్‌కు చెందిన జనరల్‌ సర్జన్‌ తుమ్మల యశ్వంత్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం విలేకరుల సమా వేశాన్ని నిర్వహించి వివరాలు వెల్లడించారు. నందిగామకు చెందిన  యువకుడికి రెండు పిరుదుల మధ్య భాగంలో వాపు రావడంతో టైమ్‌ హాస్పిటల్‌లో చేరగా పరీక్షలు చేసి పైలో నెడల్‌ సైనస్‌ గడ్డ ఏర్ప డినట్లు గుర్తించామన్నారు. దానిని ఖ్యినా లేజర్‌ ట్రీట్‌మెంట్‌తో తొలగించామన్నారు. ఈ అధునాతన చికిత్స ద్వారా ఆపరేషన్‌ జరిగిన కొన్ని గంటలకే పేషంట్‌ ఇంటికి వెళ్లి రోజువారీ పనులు చేసుకోవచ్చన్నారు. ఇటువంటి లేజర్‌ చికిత్స పైల్స్‌, లూటీలకు ఎక్కువగా ఉయోగపడుతుందన్నారు. సమా వేశంలో ఎనస్థీషియా చంద్రమౌళి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T06:26:16+05:30 IST