రైతులకు సకాలంలో రుణాలివ్వాలి

ABN , First Publish Date - 2021-07-30T05:15:18+05:30 IST

రైతులకు సకాలంలో రుణాలివ్వాలి

రైతులకు సకాలంలో రుణాలివ్వాలి
మంత్రి మల్లారెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న సహకార సంఘాల చైర్మన్లు

  •  కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి 
  • సహకార సంఘాల ఛైర్మన్లతో సమీక్ష

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి): జిల్లాలో సహకార సంఘాల ద్వారా రైతులకు దీర్ఘకాలిక పంట రుణాలు అందించడానికి ఛైర్మన్లు చొరవ చూపాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సూచించారు. గురువారం మంత్రి నివాసంలో మేడ్చల్‌ జిల్లాలోని సహకార సంఘాల ఛైర్మన్లతో ఆయన వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. సహకార సంఘాల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మూడు ఎకరాలు ఉన్న రైతులకు రూ.10 లక్షల చొప్పున రుణాలు ఇవ్వాలన్నారు. అనంతరం సహకార బ్యాంకుల సమస్యలను పరిష్కరించాలని ఛైర్మన్లు మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్లు రాంరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సురే్‌షరెడ్డి, రణ్‌దీ్‌పరెడ్డి, వైస్‌ చైర్మన్‌ మధుకర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-30T05:15:18+05:30 IST