Jul 24 2021 @ 14:29PM

‘తిమ్మరుసు’ సెన్సార్ పూర్తి

సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘తిమ్మరుసు’. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను పొందింది. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై 'మను' వంటి డిఫరెంట్ చిత్రాన్ని అందించిన  నిర్మాత సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో స‌త్య‌దేవ్ లాయ‌ర్ పాత్ర‌లో న‌టించారు. న్యాయం కోసం పోరాడే లాయ‌ర్ ఓ కేసుని వాదించే స‌మ‌యంలో ఎలాంటి ప‌రిస్థితులను ఎదుర్కొన్నాడ‌నే క‌థాంశంతో రూపొందిన ఈ చిత్రం జూలై 30న థియేట‌ర్స్‌లో విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.