Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇప్పుడు నెట్టింట ఓ సెన్సేషన్.. నాలుగేళ్ల గ్యాప్‌లోనే హిస్టరీ రిపీట్.. అభినందనల వెల్లువ

యూపీఎస్సీ ఫలితాలు వెల్లడికాగానే అభ్యర్థుల విజయగాథలు వెలుగులోకి వస్తున్నాయి. సివిల్ సర్వీస్ పరీక్ష(UPSC Main Exam Result) 2020లో 2016 బ్యాచ్ టాపర్ టీనా డబీ సోదరి రియా డబీ విజయం సాధించారు. ఆమె 15వ ర్యాంకు దక్కించుకున్నారు. 2016లో టీనా డబీ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకు సాధించారు. ఇప్పుడు ఆమె తన సోదరి విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ చేశారు. దానిలో టీనా... ‘నాకు ఎంతో ఆనందంగా ఉంది. నా చెల్లెలు రియా డబీ యూపీఎస్సీ-2020 పరీక్షలో 15వ ర్యాంకు దక్కించుకుంది’ అని రాశారు. రియా డబీ రాజస్థాన్‌కు చెందిన యువతి. 

సివిల్ సర్వీస్ పరీక్ష-2020లో బీహార్‌లోని కటిహార్ జిల్లాకు చెందిన శుభం కుమార్ టాపర్ గా నిలిచారు. ఆయన ఐఐటీ బాంబేలో బీటెక్ చేశారు. సివిల్స్ ఫలితాల్లో జాగృతి అవస్థీ రెండవ స్థానంలో, అంకితా జైన్ మూడవ స్థానంలో నిలిచారు. సివిల్ సర్వీస్ పరీక్ష-2020లో మొత్తం 761 మంది అభ్యర్థులు విజయం సాధించారు. వీరిలో 545 మంది పురుష అభ్యర్థులు ఉండగా, 216 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఈ 761 మంది విజేతలలో 263 మంది జనరల్ కేటగిరి కాగా, 86 మంది అభ్యర్థులు ఈడబ్ల్యుఎస్ తరగతికి చెందినవారు. 229 మంది ఓబీసీ వర్గానికి చెందినవారు కాగా 122 మంది ఎస్సీ శ్రేణికి చెందినవారు ఉన్నారు. అలాగే ఎస్సీ వర్గానికి చెందిన 61 మంది విజేతలుగా నిలిచారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement