Abn logo
Sep 26 2021 @ 00:54AM

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న టిప్పర్‌


- భార్య దుర్మరణం... భర్తకు గాయాలు

 అనంతపురం క్రైం, సెప్టెంబరు 25 : నగరంలో ఓ ద్విచక్రవాహనా న్ని  టిప్పర్‌ లారీ ఢీకొనడంతో ఓ మహిళ మృతిచెందగా... ఆమె భర్తకు తీ వ్ర గాయాలయ్యాయి.  ట్రాఫిక్‌ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలాఉన్నా యి. గార్లదిన్నె మండలం పాతకల్లూరుకు చెందిన  భాస్కర్‌, శాంతకుమారి(35) దంపతులకు ముగ్గురు పిల్లలు. భాస్కర్‌ హమాలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోసించే వాడు. కూలి పనులు చేస్తూ వచ్చిన డబ్బుతో పిల్లలకు బంగారు చేయించేందుకు దంపతులు ద్విచక్ర వాహనంలో శనివారం అనంతపురానికి వచ్చారు. పాతూరులోని బంగా రు షాపులో పనిముగించుకుని తిరిగి రాత్రి 8 గంటల సమయంలో  గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. గుత్తి రోడ్డులోని మా ర్కెట్‌యార్డు వద్దకు రాగానే... వెనుకవైపు వస్తున్న ఓ టిప్పర్‌ ర్యాష్‌గా ఆర్టీసీ బస్టాండ్‌ వైపునకు మళ్లింది. ఈ క్రమంలో దంపతులు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొంది. దీంతో శాంతకుమారి టిప్పర్‌ వెనుక టైరు కింద పడి దుర్మరణం చెందింది. గాయపడిన భాస్కర్‌ను స్థానికులు ప్రభుత్వా సుపత్రికి తరలించారు. ట్రాఫిక్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరో ఘటనలో యువకుడు...

 నగర శివారు లో ద్విచక్ర వాహనాన్ని ఓ టిప్పర్‌లారీ ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్‌ పోలీసులు తెలిపిన మేరకు.. కూడేరు మం డలం అరవకూరుకు చెందిన కనగానపల్లి శివరాజు(32)  వ్యవసాయంతో పాటు గొ ర్రెల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలో శనివారం శివరాజు ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి నగరంలోని వ్యవసాయ మార్కెట్‌లో జరిగే గొర్రెల సంతకు తెల్లవారుజామున వచ్చాడు. పనులు ముగించుకుని తిరిగి ఉదయం 7.30 గంటల సమయంలో ఇంటికి ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. అనంతపురం రూ రల్‌ మండలం రాచానపల్లి గ్రామ సమీపంలో వెనుక వైపు నుంచి టిప్పర్‌ లారీ  ఢీకొంది. దీంతో శివరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతపురం రూరల్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రూరల్‌ పోలీసులు కేసు న మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడి భార్య శ్రీదేవి ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి.