Advertisement
Advertisement
Abn logo
Advertisement

అందమైన కళ్ల కోసం..

ఆంధ్రజ్యోతి(10-03-2021)

చూడగానే ఎదుటివారిని ఆకర్షించేవి కళ్లే. ఆ కళ్ల సంరక్షణ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అవేమిటంటే...


అర టీస్పూను కీరారసంలో కొద్దిగా రోజ్‌వాటర్‌ కలిపి ఆ మిశ్రమాన్ని కళ్లకు రాసుకొని అలాగే అరగంటసేపు ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో కళ్లను కడుక్కోవాలి. ఇలా చేస్తే నేత్రాలు అందంగా కనిపిస్తాయి. 

ఎక్కువ సేపు నిద్రపోతే కళ్లకు తగినంత విశ్రాంతి లభిస్తుంది. కళ్లకు అలసట లేకుండా చూసుకోవడం కూడా ముఖ్యమే.

గ్లాసు నీటిలో ఉసిరిపొడి నానబెట్టి ఉదయాన్నే ఆ నీళ్లతో కళ్లను కడుక్కుంటే కళ్లు స్వచ్ఛంగా కనిపిస్తాయి.

కళ్ల చుట్టూ ఉన్న ముడతలు పోవాలంటే కళ్ల కింద పాలమీగడ రాసుకొని మసాజ్‌ చేయాలి. ఇలా చేస్తే ముడతలు పోతాయి.

బాదం నూనెలో కొంచెం ఆలివ్‌ ఆయిల్‌ని కలిపి కంటి చుట్టూ ఉండే నలుపు ప్రాంతంపై రాస్తే ఆ నలుపు పోతుంది. 

రోజూ పావుగంటపాటు రెండు చేతులను రెండు కళ్లపై ఉంచుకుని ప్రశాంతంగా కూర్చుంటే కళ్లకు సాంత్వనగా ఉంటుంది.

ఉప్పు నీటితో కళ్లను కడుక్కుంటే కళ్లు మెరుస్తాయి. కళ్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నప్పుడు మేక్‌పకు దూరంగా ఉండాలి. 

Advertisement
Advertisement