కండరాల పరిమాణం పెరిగేందుకు..

ABN , First Publish Date - 2020-10-04T05:30:00+05:30 IST

బరువు తగ్గడం కన్నా బరువు పెరగడం కొందరికి కష్టంగా తోస్తుంది. బరువు పెరగాలనే ఆలోచనతో కొందరు జంక్‌ ఫుడ్‌, చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహారం తింటూ ఉంటారు. దాంతో టైప్‌ 2 డయాబెటిస్‌, ఊబకాయం, గుండె సంబంధ జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది...

కండరాల పరిమాణం పెరిగేందుకు..

బరువు తగ్గడం కన్నా బరువు పెరగడం కొందరికి కష్టంగా తోస్తుంది. బరువు పెరగాలనే ఆలోచనతో కొందరు జంక్‌ ఫుడ్‌, చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహారం తింటూ ఉంటారు. దాంతో టైప్‌ 2 డయాబెటిస్‌, ఊబకాయం, గుండె సంబంధ జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వీరు సరైన  ఫుడ్‌, వెయిట్‌ ట్రైనింగ్‌, కండరాలను దృఢంగా మలచుకోవడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం మీద దృష్టి పెట్టాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు...


  1. వ్యాయామాలు చేసి ఖర్చుచేసే 300-500 క్యాలరీలను అదనంగా తీసుకోవాలి.
  2. సరిపడా ప్రొటీన్‌ ఫుడ్‌ తినాలి. అప్పుడే కండరాలు వృద్ధి చెందుతాయి. కిలో శరీర బరువుకు 1.5 నుంచి 2 గ్రా. ప్రొటీన్‌ తీసుకోవాలి. గుడ్లు, చేపలు, చికెన్‌, పాలు, పాల ఉత్పత్తులు, లెగ్యూమ్స్‌, నట్స్‌, గింజలలో ఆరోగ్యానికి మేలు చేసే ప్రొటీన్‌ ఉంటుంది. దాంతో తొందరగా ఆకలి వేయదు. అయితే వీటితో పాటు కొద్దిమోతాదులో కార్బోహైడ్రేట్స్‌, కొవ్వులు, ఫైబర్‌ ఉన్న ఆహారం తినాలి.
  3. కార్బోహైడ్రేట్స్‌, ఫ్యాట్స్‌... ఇవి పండ్లు, కూరగాయలలో ఎక్కువగా లభిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వు లభించే నెయ్యి, అవకాడో, ఆలివ్‌ నూనె, కొబ్బరి నూనె, ఆముదం నూనె వంటివి బరువు పెరిగేలా చేస్తాయి. 
  4. రోజులో ఎక్కువ సార్లు కొద్ది కొదిగా తినడం వల్ల బరువు పెరుగుతారు. భోజనం విరామాల మధ్య పాలతో పాటు శక్తినిచ్చే నట్స్‌, గింజలు తినాలి. 
  5. బరువులు ఎత్తడం వల్ల అదనపు క్యాలరీలు కొవ్వుగా మారవు. కండరాల పరిమాణం పెరుగుతుంది. వారంలో రెండు లేదా నాలుగు సార్లు బరువులు ఎత్తడం వల్ల బరువు పెరుగుతారు.

Updated Date - 2020-10-04T05:30:00+05:30 IST