Abn logo
Feb 22 2021 @ 00:43AM

ఒత్తైన జుట్టు కోసం...

బియ్యం కడిగిన నీళ్లను చాలామంది పడబోస్తుంటారు. అయితే ఆ నీళ్లలో జుట్టును ఒత్తుగా, ఆరోగ్యంగా ఉంచే గుణాలు ఎక్కువగా ఉంటాయి. 


  1. బియ్యం కడిగిన నీళ్లల్లో అమినో ఆమ్లాలు, విటమిన్‌ బి, ఇ, సి విటమిన్లు కూడా ఉంటాయి. ఇవి శిరోజాలు  పెరగడానికి ఎంతగానో సహకరిస్తాయి. బియ్యం నీళ్లను రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే కురులకు పట్టించాలి. అరగంట తర్వాత నీళ్లతో శుభ్రంగా కడుక్కుంటే శిరోజాలు నల్లగా నిగ నిగ లాడతాయి.
  2. బియ్యం కడిగిన నీళ్లతో మర్దనా చేసుకుంటే మాడు ఆరోగ్యంగా ఉంటుంది.
  3. జట్టు బిరుసుగా అనిపించినప్పుడు బియ్యం కడిగిన నీళ్లను పట్టించి అరగంట తరువాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా వారానికి ఒకసారి క్రమం తప్పకుండా చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.