పొట్ట తగ్గాలంటే...

ABN , First Publish Date - 2020-07-01T05:30:00+05:30 IST

పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వుతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. పొట్టను ఎలా తగ్గించాలి! అని తెగ ఆలోచిస్తుంటారు. దీనికి కొన్ని టిప్స్‌ ఉన్నాయి. వీటిని కచ్చితంగా పాటిస్తే పొట్టను తగ్గించుకోవచ్చు. అవేమిటంటే...

పొట్ట తగ్గాలంటే...

పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వుతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. పొట్టను ఎలా తగ్గించాలి! అని తెగ ఆలోచిస్తుంటారు. దీనికి కొన్ని టిప్స్‌ ఉన్నాయి. వీటిని కచ్చితంగా పాటిస్తే పొట్టను తగ్గించుకోవచ్చు. అవేమిటంటే..


  1. తొందరగా కరిగే పీచుపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. అవకాడో, నేరేడుపండ్లు, అవిసెలు వంటి వాటిల్లో పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. 
  2. ట్రాన్స్‌ఫ్యాట్స్‌ ఎక్కువగా ఉన్న పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. వీటి వల్ల గుండెజబ్బులు వంటివి రావడంతో పాటు పొట్ట చుట్టూ కొవ్వు బాగా పేరుకుంటుంది. 
  3. ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి.
  4. పోషకాలతో కూడిన డైట్‌ తీసుకోవాలి. అంటే చేపలు, మాంసం, గుడ్లు, బీన్స్‌, డెయిరీ ఉత్పత్తులు క్రమం తప్పకుండా తీసుకోవాలి.
  5. ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం.
  6. తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. లేదంటే లైఫ్‌స్టయిల్‌ జబ్బుల బారిన పడతారు. 
  7. నిత్యం ఏరోబిక్‌ వ్యాయామాలు చేయాలి. వీటి వల్ల బరువు బాగా తగ్గుతారు. 
  8. కార్బోహైడ్రేట్లు మరీ ముఖ్యంగా రిఫైన్డ్‌ కార్బోహైడ్రేట్లకు దూరంగా ఉండాలి.
  9. ఫ్రూట్‌ జ్యూసులు తాగకుండా తాజా పండ్లను అలాగే తింటే మంచిది. 
  10. మీ డైట్‌లో యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ ఉండేలా చూసుకోవాలి.
  11. ప్రో బయోటిక్‌ ఫుడ్స్‌ లేదా ప్రో బయోటిక్‌ సప్లిమెంట్లు మాత్రమే తీసుకోవాలి.
  12.  రోజూ గ్రీన్‌ టీ తాగితే మంచిది. ఇది శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది.

Updated Date - 2020-07-01T05:30:00+05:30 IST