తిరుమలలో చిరుత సంచారం

ABN , First Publish Date - 2021-08-01T18:07:04+05:30 IST

తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపుతోంది.

తిరుమలలో చిరుత సంచారం

తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. తిరుమల, పాపవినాశనం దారిలోని గోగర్భం అటవీశాఖ గార్డెన్ వద్ద చిరుత కనిపించడంతో అందరూ హడలెత్తిపోయారు. ఇటీవల కాలంలో తిరుమల ఘాట్ రోడ్లపై చిరుత సంచారం అధికం కావడంతో అటు భక్తులు, ఇటు సిబ్బంది భయాందోళనలు చెందుతున్నారు.


గత ఏడాదిన్నర కాలంగా తిరుమలలో జంతువుల సంచారం అధికమైంది. కరోనా ఆంక్షల నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోవడంతో రాత్రి సమయంలో జంతువులు సంచరిస్తున్నాయి. ఘాట్ రోడ్లతోపాటు తిరుమల అటవీ ప్రాంతం సమీపంలో ఉన్న బాలాజీనగర్, పద్మావతి గెస్ట్ హౌస్ తదితర ప్రాంతాల్లో చిరుతల సంచారం అధికమవుతోంది. నిన్న అర్ధరాత్రి గోగర్భం అటవీశాఖ గార్డెన్ వద్ద చిరుత సంచరించింది. అక్కడ విధుల్లో సిబ్బంది చిరుతను చూసి భయాందోళనకు గురయ్యారు. దీనిపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా ప్రదేశానికి చేరుకున్న అటవీ సిబ్బంది..చిరుత జాడ కోసం గాలించారు. అయితే అప్పటికే చిరుత వెళ్లిపోయింది. తరచూ తిరుమలలో చిరుత సంచరిస్తుండడంతో భక్తులు, స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు.

Updated Date - 2021-08-01T18:07:04+05:30 IST