తిరుమలలో నూతన అతిధి గృహానికి సీఎం జగన్ శంకుస్థాపన

ABN , First Publish Date - 2020-09-24T15:10:15+05:30 IST

శ్రీవారి దర్శనం, సుందరకాండ పారాయణం అనంతరం ఏపీ, కర్నాటక ముఖ్యమంత్రులు జగన్, యడ్యూరప్ప...కర్నాటక చౌల్ట్రి వద్దకు చేరుకున్నారు.

తిరుమలలో నూతన అతిధి గృహానికి సీఎం జగన్ శంకుస్థాపన

తిరుమల: శ్రీవారి దర్శనం, సుందరకాండ పారాయణం అనంతరం ఏపీ, కర్నాటక ముఖ్యమంత్రులు జగన్, యడ్యూరప్ప...కర్నాటక చౌల్ట్రి వద్దకు చేరుకున్నారు. అక్కడ రూ.200 కోట్లతో కర్ణాటక ప్రభుత్వం నిర్మించనున్న నూతన అతిధి గృహానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. మైసూరు మహారాజుల సమయం నుంచి తిరుమలలో కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించి 7ఎకరాలు భూమిలో నూతన అతిధి గృహాన్ని కర్నాటక ప్రభుత్వం నిర్మించనుంది. శంకుస్థాపన అనంతరం తిరుమల పర్యటనను ముగించుకొని అక్కడి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి సీఎం జగన్ పయనమయ్యారు. రేణిగుంట నుంచి హైదరాబాద్‌కు వెళ్లి...కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ భారతి తండ్రిని సీఎం పరామర్శించనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం గన్నవరంకు బయలుదేరి వెళ్లనున్నారు. 

Updated Date - 2020-09-24T15:10:15+05:30 IST