తిరుమల వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు

ABN , First Publish Date - 2020-11-26T13:15:49+05:30 IST

నివర్ తుపాన్ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుమల వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తోంది.

తిరుమల వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు

తిరుమల: నివర్ తుపాన్ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుమల వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తోంది. బలమైన గాలులు వీచడంతో చెట్లు విరిగిపడుతున్నాయి. పాపవినాశనం దారిపై కూలిన వృక్షాలను అటవీ సిబ్బంది తొలగించారు. మరోవైపు తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

Updated Date - 2020-11-26T13:15:49+05:30 IST