తిరుమలలో మంత్రి కొడాలి నాని

ABN , First Publish Date - 2020-09-23T20:32:27+05:30 IST

ఏపీ మంత్రి కొడాలి నాని తిరుమల చేరుకున్నారు. ఆయనతో పాటు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఉన్నారు.

తిరుమలలో మంత్రి కొడాలి నాని

తిరుమల: ఏపీ మంత్రి కొడాలి నాని తిరుమల చేరుకున్నారు. ఆయనతో పాటు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఉన్నారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు తిరుమలకు సీఎం జగన్ రాక సందర్భంగా ... ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా మంత్రులు కాస్త ముందుగా అక్కడికి చేరుకున్నారు. 


ఇదిలా ఉంటే, వేంకటేశ్వర స్వామి సన్నిధిలో డిక్లరేషన్‌పై కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న విషయం తెలిసిందే. తిరుమల ఆచార, సంప్రదాయాలను మార్చడానికి నాని ఎవరంటూ ప్రశ్నిస్తున్నాయి. కొడాలి తక్షణమే క్షమాపణ చెప్పాలని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. 

Updated Date - 2020-09-23T20:32:27+05:30 IST