Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాళీయమర్ధనుడి అలంకారంలో మలయప్ప స్వామి

తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో వైభవంగా జరగుతున్నాయి. శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ‌ మండ‌పంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత మలయప్పస్వామి.. కాళీయమర్ధనుడి అలంకారంలో స‌ర్వ‌భూపాల‌ వాహనంపై దర్శనమిచ్చారు.


సర్వభూపాల వాహ‌నం - య‌శోప్రాప్తి

సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. త ద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.


కాగా, బ్రహ్మోత్సవాలలో ఐదో రోజైన సోమ‌వారం ఉదయం 9 గంటలకు మోహినీ అవ‌తారం, రాత్రి 7 గంటలకు గ‌రుడ వాహనంపై మలయప్పస్వామి ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement