Abn logo
Sep 23 2021 @ 15:28PM

శ్రీవారి ప్రత్యేక దర్శనం టిక్కెట్ల పేరుతో భారీ మోసం

తిరుమల: శ్రీవారి ప్రత్యేక దర్శనం టిక్కెట్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు దళారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఛైర్మన్ కోటాలో దర్శనం కల్పిస్తామని భువనగిరికి చెందిన భక్తుల్ని నమ్మించారు. 11 మంది నుంచి రూ. 16 వేలకు ఒప్పందం చేసుకున్నారు. అడ్వాన్స్‌గా రూ. 8 వేలు తీసుకుని టీటీడీ ఛైర్మన్ పేరుతో నకిలీ మేసేజ్‌లు పంపించారు. ఈ మేసేజ్‌లు నిజమనుకున్న భక్తులు ఛైర్మన్ కార్యాలయానికి వెళ్లగా అవి ఫేక్ మెసేజ్‌లని సిబ్బంది తెలిపారు. దీంతో తమకు జరిగిన మోసంపై భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసానికి పాల్పడ్డ కిషోర్, నాగరాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతంలో కూడా వారు పలువురు భక్తులను  మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption