తిరుమల బ్రహ్మోత్సవాల్లో జరుగుతున్నదేంటి?

ABN , First Publish Date - 2020-09-23T23:59:13+05:30 IST

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి..

తిరుమల బ్రహ్మోత్సవాల్లో జరుగుతున్నదేంటి?

తిరుమల బ్రహ్మోత్సవాల్లో జరుగుతున్నదేంటి?. సీఎం వచ్చినా హడావుడి ఎందుకు కనిపించడంలేదు. ప్రతి ఏడాది జరిగేదేంటి?. ఇప్పుడేం జరుగుతోంది?.


తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ప్రారంభమైంది. అంతవరకూ ఎండోమెంట్ కమిషనర్ పట్టు వస్త్రాలను మొక్కుబడిగా సమర్పించేవారు. కారులో ఆలయం ఎదుట దిగి మొక్కుబడిగా ఇచ్చేసి వెళ్లిపోయారు. అయితే 1983లో సీఎం హోదాలో ఎన్టీఆర్ శ్రీవారికి పట్టు వస్త్ర్రాలు సమర్పించారు. ఆయన బేడీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి తలపై శ్రీవారికి సమర్పించే పట్టువస్త్రాలను మోసుకుంటూ ఆలయంలోకి వెళ్లారు. అప్పుడు తిరుమల లో ఒకటే హడావుడి బేడీ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి శ్రీవారి ఆలయం వరకూ వెళ్లడానికి సుమారు గంట సమయంపట్టింది. 


అప్పటి నుంచి ప్రతి ఏటా ఎన్టీఆర్ రాక కోసం బేడీ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి శ్రీవారి ఆలయం వరకూ బారికేడ్లు కట్టి అందులో ఎన్టీఆర్ పట్టువస్త్రాల సమర్పణకు వెళ్లేవారు. అయితే ఈ పర్యటనలో ఆయన తిరుపతిలో అనేక శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి తిరుమలకు వెళ్లేవారు. అలా శంకుస్థాపనలు వేసినవే స్విమ్స్, మహిళా యూనివర్సిటీ, అలాగే తిరుపతిలో టీటీడీకి చెందిన ఎన్నో సత్రాలు ఉన్నాయి. ఈ సంస్కృతి  ఎన్నో సంవత్సరాలుగా ఉంది. తిరుపతిలో లేకపోతే తిరుమలలో అయినా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఉండేవి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి బ్రహ్మోత్సవానికి సీఎం వచ్చినప్పుడు తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీవారి క్యాలండర్లు, డైరీలను సీఎం ఆవిష్కరించే వారు.  ఆ తర్వాత టీటీడీ విక్రయాలను మొదలు పెట్టేది. 

Updated Date - 2020-09-23T23:59:13+05:30 IST