తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

ABN , First Publish Date - 2021-06-17T14:15:35+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం తిరుమల శ్రీవారిని 14,116 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం తిరుమల శ్రీవారిని 14,116 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 5842 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.1 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. కాగా.. తిరుమలలో ఎల్లుండి పాలకమండలి సమావేశం జరగనుంది. 20న భోగ శ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు. 21తో ప్రస్తుత పాలకమండలి గడువు ముగియనుంది. 22 నుంచి మూడు రోజుల పాటు జేష్ఠాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. 24న వర్చువల్ ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేయనుంది. 

Updated Date - 2021-06-17T14:15:35+05:30 IST