భూగర్భ జలాల పెంపులో తిరుమలనగర్‌కు జాతీయ స్థాయి గుర్తింపు

ABN , First Publish Date - 2021-01-17T05:21:05+05:30 IST

భూగర్భ జలాలు పెంపు, నీటి పొదుపుపై చేసిన కృషికి స్థానిక తిరుమలనగర్‌ రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.

భూగర్భ జలాల పెంపులో తిరుమలనగర్‌కు జాతీయ స్థాయి గుర్తింపు
తిరుమల నగర్‌ కాలనీ ప్రవేశ ద్వారం

కూర్మన్నపాలెం: భూగర్భ జలాలు పెంపు, నీటి పొదుపుపై చేసిన కృషికి  స్థానిక తిరుమలనగర్‌ రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఈ మేరకు కేంద్ర జల సంరక్షణ శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ ప్రశంసాపత్రాన్ని అసోసియేషన్‌ కార్యదర్శి ఎం.పరమానందంకు పోస్టులో పంపారు. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రాజెక్టులను ఎంపిక చేయగా, రాష్ట్రం నుంచి ఈ ప్రాజెక్టు మాత్రమే ఎంపిక కావడం విశేషం. కాలనీలో  వర్షపు నీరు వృఽథాగా పోకుండా ఇంకుడు గుంతల్లో పంపే ప్రాజెక్ట్‌ను వివరిస్తూ అసోసియేషన్‌ కార్యదర్శి పరమానందం కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. దీంతో 2020 నవంబరు నెలకు గాను చేపట్టిన ఎంపికలో ఈ ప్రాజెక్ట్‌ను ఉత్తమమైనదిగా ఎంపిక చేశారు.


Updated Date - 2021-01-17T05:21:05+05:30 IST