రంగుల మహోత్సవానికి తరలివచ్చిన గోపయ్య సమేత తిరుపతమ్మ, పరివార దేవతలు

ABN , First Publish Date - 2022-01-22T06:45:26+05:30 IST

రంగుల మహోత్సవానికి తరలివచ్చిన గోపయ్య సమేత తిరుపతమ్మ, పరివార దేవతలు

రంగుల మహోత్సవానికి తరలివచ్చిన  గోపయ్య సమేత తిరుపతమ్మ, పరివార దేవతలు
జగ్గయ్యపేట రంగుల మండపంలో తిరుపతమ్మకు పూజలు చేస్తున్న అర్చకులు

జగ్గయ్యపేటలో ఘనస్వాగతం పలికిన చైర్మన్‌, భక్తులు

జగ్గయ్యపేట, జనవరి 21: రంగుల మహోత్సవానికి పెనుగంచిప్రోలు గోపయ్య సమేత తిరుపతమ్మ, అమ్మవారి పరివార దేవతలు శుక్రవారం సాయంత్రం జగ్గయ్యపేట చేరుకున్నాయి. మునిసిపల్‌ సెంటర్‌లో మునిసిపల్‌ చైర్మన్‌ రంగాపురం రాఘవేంద్ర, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను తనయుడు ప్రశాంత్‌బాబు, ఆకుల బాజి, పలువురు కౌన్సిలర్లు, నేతలు అమ్మవారికి స్వాగతం పలికారు. జగ్గయ్యపేట -చిల్లకల్లు రోడ్డులో ప్రజలంతా దేవతలకు స్వాగతం పలుకుతూ వారు పోశారు. అక్కడ నుంచి పట్టణంలోని రంగు బజార్‌లో ఉన్న రంగుల మహోత్సవ మండపంలో దేవతామూర్తులను చైర్మన్‌తో పాటు పలువురు ప్రముఖులు స్వయంగా మోస్తూ తీసుకువచ్చారు. తిరుపతమ్మ దేవస్థానం చైర్మన్‌ ఇంజం కేశవరావు, ఇన్‌చార్జ్‌ ఈవో భ్రమరాంభ, దేవస్థానం అర్చకులు, డైరెక్టర్లు వారితో పాటు పాల్గొన్నారు. 

ఊరేగింపులో తీవ్ర జాప్యం..

రెండోరోజూ పెనుగంచిప్రోలు నుంచే ..

రంగుల మహోత్సవం షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించటంలో అధికారులు సఫలం కాలేకపోయారు. గురువారం అర్ధరాత్రి వరకు గ్రామంలో అమ్మవారు, ఇతర పరివార దేవతలు ఊరేగింపు ఉండి పోయింది. అఖండ సినిమాలో ఎడ్లు ఊరేగింపులో ప్రత్యేకాకర్షణ కావటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో చూసేందుకు తరలివచ్చారు. ఊరేగింపు ముందుకు సాగటం కష్టమైంది. గురువారం రాత్రి మక్కపేటలో అమ్మవారు, పరివార దేవతలు బస ఏర్పాటు చేసిన పెనుగంచిప్రోలులోనే ఊరేగింపు ఆలస్యం కావటంతో తంబరేణి ఫంక్షన్‌హాలులోనే రాత్రి ఉంచారు. శుక్రవారం ఉదయం 5 గంటలకు మక్కపేట నుంచి బయల్దేరిన ఊరేగింపు సాయంత్రం 4గంటలకు జగ్గయ్యపేట చేరుకుంది.


Updated Date - 2022-01-22T06:45:26+05:30 IST