జలదిగ్బంధంలో తిరుపతి ..

ABN , First Publish Date - 2021-11-19T17:21:00+05:30 IST

తిరుమలలో కురుస్తున్న కుండపోత వర్షానికి బారీగా వరద నీరు ప్రవహిస్తోంది.

జలదిగ్బంధంలో తిరుపతి ..

చిత్తూరు: తిరుమలలో కురుస్తున్న కుండపోత వర్షానికి బారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ఎటు చూసినా ప్రవహించే నీటితో పరిస్థితులు భయానకంగా మారాయి. కనుమ దారులు వాగులుగా మారగా.. కాలినడక మార్గాలు జలపాతాన్ని తలపిస్తున్నాయి.  ఘాట్ రోడ్డులో విరిగిపడుతున్న చెట్లు, కొండచరియలతో పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. ఎప్పుడు లేనంతగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సెల్లార్‌లోకి వరద నీరు చేరింది. గతంలో ఎన్నడూ లేనంతగా వరదనీటి ప్రవాహం భయాందోళనకు గురిచేస్తోంది. తిరుమాఢ వీధిల్లో రహదారులు నీటితో  చెరువులను తలపిస్తున్నాయి. 


మరోవైపు మొబైల్ సేవలకు అంతరాయం ఏర్పడడంతో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అటవీ ప్రాంతంలోని వరద నీరు నడకమార్గంలో మెట్లపై ప్రవహిస్తోంది. అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గం జలపాతాలను తలపిస్తున్నాయి. ముందస్తు భద్రతా చర్యలతో నడకమార్గాలను మూసివేయడంతో ప్రమాదం తప్పింది. రోడ్లపై ప్రవహించే నీరు.. వాగులు, వంకలను తలపిస్తోంది. ఘాట్ రోడ్లలతో అనేక ప్రాంతాల్లో కొండచరియలు పడ్దాయి. చెట్లు, మట్టి రహదారులపై కొట్టుకురవాడంతో ఘాట్ రోడ్లను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Updated Date - 2021-11-19T17:21:00+05:30 IST