Advertisement
Advertisement
Abn logo
Advertisement

తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు నీటి సరఫరా బంద్‌.. కేంద్రం సీరియస్‌

తిరుపతి: తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు నీటి సరఫరా నిలిపివేయడంపై కేంద్రం సీరియస్‌ అయింది. ఎయిర్‌పోర్ట్‌, విమానాశ్రయ సిబ్బంది ఇళ్లకు తాగునీటి సరఫరా నిలిపివేశారు. దీంతో  కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విచారణకు ఆదేశించారు. దర్యాప్తుకు చెన్నై నుంచి అధికారులు వస్తున్నారు. ఈ నెల 9న తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు మంత్రి బొత్స సత్యనారాయణ వచ్చారు. మంత్రికి స్వాగతం పలికేందుకు వైసీపీ నేతలు భారీఎత్తున తరలివచ్చారు. పాస్‌లు లేనివారిని ఎయిర్‌పోర్ట్‌లోకి అధికారులు అనుమతించలేదు. ఆ మరుసటి రోజే ఎయిర్‌పోర్ట్‌, సిబ్బంది ఇళ్లకు నీటి సరఫరా బంద్‌ చేశారు. పైప్‌లైన్లు కట్‌ చేసి, టాంకర్లు వెళ్లకుండా అడ్డంగా రోడ్డును తవ్వారు. ఎయిర్‌పోర్ట్‌లోకి తమని రానివ్వనందుకే వైసీపీ నేతలు ఈ పని చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement