కరోనా మృతుల దహనక్రియల్లో తిరుపతి ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-05-14T06:23:11+05:30 IST

తిరుపతి రుయాస్పత్రిలో కరోనాతో చనిపోయిన ఏడుగురి మృతదేహాలను సంబంధిత కుటుంబీకులెవరూ తీసుకెళ్లకపోవడంతో తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి చొరవ తీసుకుని సంప్రదాయబద్దంగా దహన క్రియలు జరిపించారు.

కరోనా మృతుల దహనక్రియల్లో తిరుపతి ఎమ్మెల్యే
అనాథ మృతదేహానికి కరుణాకర రెడ్డి దహన క్రియలు

తిరుపతి(రవాణా), మే 13: తిరుపతి రుయాస్పత్రిలో కరోనాతో చనిపోయిన ఏడుగురి మృతదేహాలను సంబంధిత కుటుంబీకులెవరూ తీసుకెళ్లకపోవడంతో తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి చొరవ తీసుకుని సంప్రదాయబద్దంగా దహన క్రియలు జరిపించారు. ఇలాంటి వందలాది అనాథ మృతదేహాలకు సేవాభావంతో అంత్యక్రియలు నిర్వహిస్తూ వస్తున్న ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో మృతదేహాలను తిరుపతి నగరంలోని హరిశ్చంద్ర శ్మశానవాటికకు తీసుకొచ్చారు. హిందూ సంప్రదాయబద్ధంగా ఆ మృతదేహాలకు రక్తసంబంధీకుడిలా ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి అన్ని కార్యక్రమాలను పూర్తిచేశారు.పాడె మోసి చితికి నిప్పుపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ దైవకార్యంగా భావించే అనాధ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించామన్నారు.కరోనా బారినపడి చనిపోయినవారి దహనక్రియలకు సొంతమనుషులు కూడా రాకపోవడం బాధాకరమన్నారు. కరోనా అన్నది  అతిగా భయపడాల్సిన జబ్బు కాదన్న విషయాన్ని అందరూ గ్రహించాలని సూచించారు.తన వయస్సు 64సంవత్సరాలని, రెండు సార్లు కరోనా సొకిందని, అయినప్పటికీ ప్రజాసమస్యలు, వారిబాధలు పట్టించుకోవడం కన్నా మరేవీ తనకు ముఖ్యం కాదన్నారు.  

Updated Date - 2021-05-14T06:23:11+05:30 IST