తిరుపతి: ఎస్వీబీసీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన సురేష్‌కుమార్

ABN , First Publish Date - 2020-08-13T16:40:18+05:30 IST

టీటీడీ స్పెషల్ ఆఫీసర్ ఏ.వీ.ధర్మా రెడ్డి నుండి ఎస్వీబీసీ సీఈవోగా సురేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.

తిరుపతి: ఎస్వీబీసీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన సురేష్‌కుమార్

తిరుపతి: టీటీడీ స్పెషల్ ఆఫీసర్ ఏ.వీ.ధర్మా రెడ్డి నుండి ఎస్వీబీసీ సీఈవోగా సురేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అయోధ్య రామాలయ భూమిపూజ లైవ్ ఎస్వీబీసీలో టెలికాస్ట్ కాకపోవటంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గతంలో టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ సీఈవోగా ఉన్న నగేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. అలాగే కొత్త సీఈవోగా కేంద్ర సర్వీసుల్లో ఉన్న సురేష్ కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఈరోజు సురేష్‌ కుమార్ ఎస్వీబీసీ సీఈవోగా బాధ్యతలను స్వీకరించారు. 

Updated Date - 2020-08-13T16:40:18+05:30 IST