Abn logo
Sep 24 2021 @ 07:54AM

తిరుపతి శ్రీనివాసం వద్ద ఉద్రిక్తత

తిరుపతి: తిరుపతి బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీనివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీనివాసంలో నిన్నటి నుంచి ఉచిత దర్శనం టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేసింది. 26 నుంచి ఆన్‌లైన్లో ఉచిత దర్శనం టోకెన్ల కేటాయింపు నేపథ్యంలో ఈ రోజు టోకెట్లను కూడా నిన్ననే శ్రీనివాసంలో కేటాయించింది. కాగా ఈ విషయం తెలియక తిరుపతికి చేరుకున్న వేలాది మంది భక్తులు శ్రీనివాసం వద్ద టోకెన్లు ఇవ్వకపోవటంతో  వాగ్వివాదానికి దిగారు. శ్రీనివాసం గేటు వద్దకు రాకుండా భక్తులను పోలీసులు చెదరగొడుతున్నాయి. దీంతో తిరుపతి శ్రీనివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీటీడీపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption