క్రికెట్‌కు తిసార పెరీరా గుడ్‌బై

ABN , First Publish Date - 2021-05-04T09:21:20+05:30 IST

శ్రీలంక ఆల్‌రౌండర్‌ తిసార పెరీరా (32) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. టీ20 ఫ్రాంచైజీ క్రికెట్‌ లీగ్‌ల్లో మాత్రం

క్రికెట్‌కు తిసార పెరీరా గుడ్‌బై

కొలంబో: శ్రీలంక ఆల్‌రౌండర్‌ తిసార పెరీరా (32) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. టీ20 ఫ్రాంచైజీ క్రికెట్‌ లీగ్‌ల్లో మాత్రం మరి కొంతకాలం ఆడతానని తెలిపాడు. వన్డేల్లో 2009లో భారత్‌పై అరంగేట్రం చేసిన పెరీరా ఈ ఏడాది మార్చిలో వెస్టిండీ్‌సపై తన చివరి మ్యాచ్‌ ఆడాడు. 166 వన్డేల్లో 2,338 పరుగులు, 175 వికెట్లు తీసిన పెరీరా 84 టీ20ల్లో 1204 రన్స్‌, 51 వికెట్లు పడగొట్టాడు. ఆరు టెస్టుల్లో మాత్రమే ఆడిన ఈ ఆల్‌రౌండర్‌ 203 రన్స్‌ చేశాడు.

Updated Date - 2021-05-04T09:21:20+05:30 IST